ద్యావుడా..? వాళ్ల పై కోపంతోనే బన్ని అలాంటి డెసీషన్ తీసుకున్నాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీని హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు . ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ ప్రోమో జనాలకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. కొందరు ఫాన్స్ ఈ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పుకున్నారు . అయితే కావాలనే అల్లు అర్జున్ అంటే పడని కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు . సినిమాకి కూడా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం అవసరమా అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ఆయనని ట్రోల్ చేశారు .

ఈ ట్రోలింగ్ బన్నీ వద్దకు చేరింది. దీంతో తిక్క రేగిన బన్నీ సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . నిన్న మొన్నటి వరకు ఈ సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వరకే తీసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . కానీ ఎప్పుడైతే ఆయనపై ట్రోలింగ్ జరుగుతుందో ఆయనను చీప్ గా వల్గర్ గా మాట్లాడుతున్నారు అది తెలుసుకున్న బన్నీ అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసాడట. సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ దానితో పాటు ఓ ఏరియాలో షేర్ కూడా అడిగారట .

ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అడిగి అడగగానే మేకర్స్ కూడా బన్నీ డెసిషన్ ను ఓకే చేయడం ఇక్కడ చెప్పుకో తగిన విషయం అంటున్నారు బన్నీ అభిమానులు. మరికొందరు అదేంటి వాళ్ళు ఎవరో ట్రోలింగ్ చేస్తే సడన్ గానే పారితోషకం పెంచడం కరెక్టేనా..? పాన్ ఇండియా హీరో కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా..? ఒకరి మీద కోపంతో ఇలాంటి నిర్ణయమా..? అంటూ మరోసారి బన్ని ని వెటకారంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు . దీంతో బన్నీ ఫ్యాన్స్ అలాంటి వాళ్లకు ఇచ్చి పడేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా మాకు అనవసరం ఆగస్టు 15వ తేదీ బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు . చూద్దాం మరి పుష్ప 2 సినిమా బన్నీ కెరీర్ ని ఎలా మలుపు తిప్పబోతుందో..??