కేవలం తారక్ కోసమే అలాంటి పని చేశా.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజ‌ల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మగధీరతో ఓవర్ నైట్‌ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోల‌ అందరి సరసన నటించిన కాజల్.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో గౌతమ్ కిచ్‌లును వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి నీల్ కిచులు కి జన్మనిచ్చింది.

Alitho Saradaga Season 2 | Episode 8 Promo | with Kajal Aggarwal | Watch it on ETV

ప్రస్తుతం రియంట్రీ ఇచ్చిన కాజ‌ల్‌ మరోసారి సినిమాల్లో నటిస్తూ బిజీగా గ‌డుతుంది. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొని సందడి చేసిన కాజల్.. తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో సంద‌డి చేసింది. ఇందులో ఆలీ.. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నావు.. గౌతమ్ ఏమైనా రూల్ పెట్టాడా.. అంటూ ప్రశ్నించాడు.. అలాంటిదేమీ లేదు. నేను చాలా రోజుల నుంచి యాక్షన్ తరహాలో విలన్స్‌ను కొట్టే పాత్రలు చేయాలని అనుకుంటున్నా.. అందులో భాగంగానే సత్యభామ కథకు ఓకే చెప్పా అంటూ వివరించింది.

Kajal Agarwal Pakka Local Janatha Garage Item Song ULTRA H… | Flickr

అయితే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.. మంచి బ్యానర్, పెద డైరెక్టర్, రెమ్యూనరేషన్ ఇవన్నీ ఆలోచించి నేను ఐటం సాంగ్స్ చేయలేదు. కేవలం ఎన్టీఆర్ సినిమా అనే ఒక కారణంతోనే తారక్ కోసమే ఈ ఐటెం సాంగ్ చేశా అంటూ వివరించింది. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్లు వైర‌ల్ అవ్వ‌డంతో అంత ఆశ్చర్యపోతున్నారు. రెమ్యునరేషన్ కన్నా ఎన్టీఆర్ సినిమా అన్నే చేశా అంటూ కాజల్ చేసిన కామెంట్స్ కి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తార‌క్ ఫ్యాన్స్‌.