చెర్రీ ఫ్యాన్స్ కు మండిస్తున్న శంకర్.. గేమ్ చేంజర్ నుంచి షాకింగ్ అప్డేట్..?!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాన్ని.. చరణ్ కు జంటగా కనిపించనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూవీపై ఫ్యాన్స్ లో మరింత అంచనాలను పెంచింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా చూస్తామా.. అంటూ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ మూవీ కి సంభంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. నిజానికి గేమ్ చేంజర్‌ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది. దానికి కారణం డైరెక్టర్ శంకర్.

ఆయన గేమ్ చేంజర్ తో పాటే కమల్ హాసన్ ఇండియన్ 2కు కూడా దర్శకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్2 పై పూర్తి ఫోకస్ పెట్టిన శంకర్.. గేమ్ చేంజ‌ర్‌కు మధ్యలో బ్రేక్లు ఇస్తూనే ఉన్నాడు. అయితే రామ్ చరణ్ మూవీ కోసం ఎంతో ఈగర్‌ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఇలా శంకర్ సినిమాను మరింతగా ఆలస్యం చేస్తున్నాడు అంటూ తెలియడంతో అతనిపై ఫైర్ అవుతున్నారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.