క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.. సర్దుకుపోవాలి అంటూ..?!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాల‌లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పటికీ 300కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న రమ్యకృష్ణ.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లో శివగామి పాత్రలో మెప్పించింది. ప్రభాస్ తర్వాత అంతగా పాపులారిటీ దక్కించుకున్న పాత్ర ఏదైనా ఉంది అంటే రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా రంగమార్తాండలో తల్లి పాత్ర, జైలర్‌లో రజనీకాంత్ తల్లి పాత్రలను పోషించి ఆక‌ట్టుకుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ పై ఎంతోమంది స్టార్ నటీ,నటులు, హీరోయిన్లు స్పందించిన సంగతి తెలిసిందే. అంతే కాదు కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామంటూ వివరించారు. ఈ క్రమంలో రమ్యకృష్ణ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కోచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లో ఉంటుంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీని బాగా టార్గెట్ చేస్తూ సినిమా వాళ్ళను బయట వేస్తున్నారు అంటూ వివ‌రించింద‌ట‌. సెలబ్రిటీలు ఎక్కువగా ఉండడంతో ఈ రంగాన్ని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ.. తమ స్వలాభం కోసం కూడా కొంతమంది సినీ ఇండస్ట్రీని ఇలా బ్యాడ్ చేస్తూ ప్రచారం చేసి సందడి చేస్తున్నారు.

సినిమాల్లో స్టార్ గా ఎదగాలంటే నటీ,నటులు కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి వస్తుంది అని రమ్యకృష్ణ కామెంట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే రమ్యకృష్ణ అలాంటి వ్యాఖ్యలు చేశారా.. లేదా.. సోషల్ మీడియాలో కావాలనే రూమర్స్ ను క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారా అని దానిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న రమ్యకృష్ణ లాంటి అమ్మాయి.. ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇప్పటికే రమ్యకృష్ణకు తన సినీ కెరీర్లో నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, మూడునంది అవార్డులు దక్కాయి.