రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ రిజెక్ట్ చేసిన పవన్.. ఏ సినిమా అంటే..?!

దర్శ‌కధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్‌ల‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో దర్శక దిగ్గజంగా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సక్సెస్ తప్పించి.. ఫెయిల్యూర్ లేని దర్శకుడుగా 24 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు రాజమౌళి. అలాంటి రాజమౌళితో సినిమా అవకాసం వస్తే బాగుంటుందని చిన్న హీరోల నుంచి టాప్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఆశ పడుతూ ఉంటారు. ఇక చత్రపతి తర్వాత ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రాజమౌళి సొంతంగా తన బ్యానర్ ని స్థాపించడు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఎస్.ఎస్.రాజమౌళి సంచలన  కామెంట్స్..!! | NewsOrbit

ఎన్టీఆర్ తో మంచి సినిమా చేయాలని మొదట జక్కన్న భావించాడట. కానీ అందుకు ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా ఖర్చులు అవుతాయి.. ఈలోగా మరో సినిమా చేద్దామని భావించాడట. అప్పటికి జ‌క్కన దృష్టిలో ఉన్న మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కోసం ఆయనకు సెట్ అయ్యే ఓ కథ‌రాయమని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు వివరించాడట రాజమౌళి. ఇక జ‌క్క‌న సినిమా అంటే ఇప్పుడే కాదు.. అప్పట్లో కూడా ఏ స్టార్ హీరో కాదని వారు కాదు. ఇండస్ట్రీ జనాలకు రాజమౌళి పై అలాంటి నమ్మకం ఏర్పడింది. అయితే రాజమౌళి ఎంతో కష్టపడి పవర్ స్టార్ కోసం ఓ కథ‌ని రాపించుకొని వెళ్లి పవన్‌కు కథ వినిపించినా.. ఆయన అవకాశం ఇవ్వలేదంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో..? అసలు కారణమేంటో..? తెలుసుకుందాం.

Vikramarkudu 2 : 'విక్ర‌మార్కుడు 2' గురించి నిర్మాత ఇంట్రెస్టింగ్  కామెంట్స్.. | Tollywood producer interesting comment about ravi teja  vikramarkudu 2-10TV Telugu

పవన్ కళ్యాణ్ కు అయితే బాగా సెట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ మొదట విక్రమార్కుడు సినిమా కథను రాసి జక్కన్నకు ఇచ్చాడట. అయితే అందులో పోలీస్ పాత్ర మాత్రమే పవర్ స్టార్ కు తగ్గట్టు కాస్త కామెడీ యాడ్ చేసి రాశార‌ట‌. కాని కథ‌ని రాజమౌళి.. పవన్ కళ్యాణ్ కి వినిపించగా అది విన్న పవన్ ఇప్పుడు చేయను. కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత చూద్దాం అని సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇక వెంటనే రాజమౌళి లేట్ చేయకుండా కథలో కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఇదే సినిమాను రవితేజతో తెర‌కెక్కించాడు రవితేజ. బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా సెట్ కావడంతో ఫ్యాన్ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ దొంగ పాత్రలో అత్తిలి సత్తిబాబుగా ర‌వితేజా నటన ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. ఈ సినిమాతో రవితేజకు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం పవన్ నటించాల్సిన విక్రమార్కుడు రవితేజ నటించాడంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. ఏదేమైనా రవితేజ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు అంటూ.. తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.