షుగర్ పేషెంట్స్ దానిమ్మ తినవచ్చా.. డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..?!

మధుమేహం లేదా షుగర్ వ్యాధి ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఆహార‌పు అలవాట్లు, శరీరక శ్రమ లేకపోవడం కారణంగా కోట్లాదిమందిని వేధిస్తుంది. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. జీవితకాలం దానితో పోరాడుతూ ఉండాలి. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ ఆరాన్ని పడితే ఆ ఆహారాన్ని తీసుకోకూడదు. ఏది తినాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రూట్స్ జోలికి అసలు వెళ్ళరు. ఎందుకంటే ఫ్రూట్స్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండి.. రక్తంలో చక్కెరను అధికం చేస్తాయని వారు భయపడుతూ ఉంటారు. సపోటా, మామిడి, చెర్రీ, గ్రేప్స్, ఖర్జూరం, అరటి లాంటి పండ్లు ఆ జాబితాలోకి వస్తాయి.

Q&A: Does diabetes mean worse outcomes for cancer patients? | Imperial News  | Imperial College London

మరి దానిమ్మ పండు షుగర్ వ్యాధి ఉన్నవారు తినవచ్చా.. లేదా.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే దానిమ్మను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినోచ్చో లేదో ఒకసారి చూద్దాం. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసి శరీరంలో రక్తస్థాయిని పెంచే ఫ్రూట్స్‌లో మొదటిది దానిమ్మ. తినడానికి ఎంతో రుచికరంగా విటమిన్ సి, వీటన్నికే, ఫాలోట్, మెగ్నీషియం, ఫాస్ఫ‌రస్‌, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. ఇది జీవక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహకరిస్తుంది. అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి.. కణ విభజన, ర‌క్త‌ పోటును నియంత్రించడానికి కూడా కీలకపాత్ర వహిస్తుంది. చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గ్లోగా కనిపించేలా చేస్తుంది.

How to control diabetes, blood sugar level: Add pomegranate to your diet,  but in moderation

రక్తహీనతను తరిమికొట్టి.. ఎర్ర రక్త కణాల నిర్మాణానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా దానిమ్మ ఎంతగానో సహకరిస్తుంది. ఇక మధుమేహం ఉన్నవారు తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోస్ నెమ్మదిగా పెరగడానికి సహకరిస్తాయి. అయితే దానిమ్మలో కూడా తక్కువ గ్లైసమిక్స్ ఇండెక్స్ ఉంటుంది. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ప్రభావం చూపుతాయి. కనుక దానిమ్మ పండును షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవచ్చు. ఏ ఆహారం అయినా మితంగా తీసుకోవడం చాలా అవసరం. తినవచ్చు కదా అనే ఉద్దేశంతో అదే పనిగా ఏ ఆహారాన్ని తీసుకున్నా.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.