మహేష్ బాబు తన కెరియర్ లో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే.. ఎందుకంటే..?

మహేష్ బాబు ..టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా …? నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ గా రాజ్యం ఏలేస్తున్నాడు . ఆయన చివరిగా నటించిన సినిమా గుంటూరు కారం . అఫ్కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకుంది.

కానీ మహేష్ నటన టూ గుడ్ అంటూ ప్రశంసలు దక్కించుకుంది . తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. తన కెరీర్లు ఒకే ఒక్క సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసారట .ఆ విషయం ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది. మహేష్ బాబు కెరియర్లో డిజాస్టర్ మూవీ గా నిలిచిన సినిమా సైనికుడు .

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరమ చెత్త టాక్ క్రియేట్ చేసుకుంది. భారీ డిజాస్టర్ వాసూళ్లను కలెక్ట్ చేసింది . ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న పారితోషకం పూర్తిగా వెనక్కి ఇచ్చేశారట మహేష్ బాబు. సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకోవడం మేకర్స్ నష్టాలు ఎదుర్కోవడంతోనే మహేష్ పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారట . ఈ న్యూస్ అప్పట్లో బాగా ట్రెండ్ అయింది .ఆ విషయంలో దేవుడు మహేష్ బాబు అంటూ అప్పట్లో ఆయన ఫ్యాన్స్ ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!