రెబల్ స్టార్ నటించిన సినిమాల్లో వాళ్ళ అమ్మకు బాగా నచ్చిన సినిమా ఇదే..?!

టాలీవుడ్ రెబల్ స్టార్.. పాన్‌ ఇండియన్‌ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్ర‌స్తుతం స‌లార్ 2 , రాజాసాబ్‌, క‌ల్కి 2898 ఏడి ఇలా వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇంత స్టార్ హీరో అయిన తన తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించాడు.

Mirchi Telugu Full Movie Part 1/2 Prabhas, Anushka, Richa, 55% OFF

వాళ్ళ నాన్న అనారోగ్య కారణంగా మరణించారు. ఇక ప్రభాస్ తల్లి బ‌య‌ట ప్ర‌పంచానికి మీడియాకు దూరంగా ఉంటుంది. ఇక ప్రభాస్ నటించిన అన్ని సినిమాల్లో వాళ్ళ అమ్మకు ఇష్టమైన సినిమా ఇదే నంటూ ఓ న్యూస్ నెటింట తెగ‌ వైరల్ గా మారుతుంది. ప్రభాస్ అనుష్క జంటగా నటించిన మిర్చి మూవీ ప్రభాస్ తల్లికి చాలా ఇష్టమట. కొర‌టాల ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ మధ్యనే ఉండే ఎమోషన్స్‌ను బాగా చూపించాడంటూ తెలుస్తుంది.

Kattappa joins Radhe Shyam shoot again | Telugu Cinema

ప్రభాస్ ని ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలనుకున్నామో.. అలాంటి క్యారెక్టర్‌లోనే కొరటాల శివ ఆయనను చూపించారని.. దానికి చాలా సంతోషంగా ఉందంటూ ఆమె తన సన్నితుల దగ్గర ఎప్పుడూ చెబుతూ ఉంటుందట. ఇక దానివల్ల ప్రభాస్ వాళ్ళ అమ్మకి ప్రభాస్ నటించిన అన్ని సినిమాల్లో మిర్చి సినిమానే ఫేవరెట్ మూవీ అయ్యిందట.