తారక్ నుంచి ఒకేసారి ట్రిపుల్ ధమాకా.. ఫ్యాన్స్ కు పండగ.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఓ పక్కన దేవర షూటింగ్లో పాల్గొంటూనే.. మరోపక్క బాలీవుడ్ వార్ 2 షూటింగ్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. కాగా ఆర్ఆర్ఆర్‌ తర్వాత తారక్ నుంచి ఒక్క కొత్త సినిమా కూడా వెండితెరపై క‌నిపించ‌లేదు.

దీంతో ఎప్పుడెప్పుడు తారక్ నుంచి సినిమా వస్తుందా అంటూ తారక్ అభిమానులతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌ తర్వాత పలు ఈవెంట్లలో సందడి చేసిన ఎన్టీఆర్.. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ అప్డేట్ ఇవ్వమని అడగడంతో ఊరికే అప్డేట్స్ అడగొద్దంటూ ఫాన్స్ పై ఫైర్ అయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం తన ఫ్యాన్స్‌కు అడ‌గ‌కుండానే ట్రిపుల్ ధ‌మాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

Jr NTR to collaborate with KGF Chapter 2's director Prashanth Neel for  NTR31, first look out | See here

త్వరలోనే తారక్‌ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అడగకపోయినా వారి ఆత్రాన్ని ఆరాటాన్ని అర్థం చేసుకుంటూ దేవర ల్లోని సాంగ్. గ్లింప్స్‌ అలాగే వార్ 2 నుంచి ఫస్ట్ లుక్.. దీంతో పాటే ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను కూడా పుట్టినరోజు సందర్భంగా మే 20న రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఒకే రోజున తారక్ నుంచి ఇలా మూడు అప్డేట్లు వస్తాయని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.