ఆ రెండు సినిమాలు దిల్ రాజు దూల తీర్చేసాయా..? ఇక ఆ కాన్సెప్ట్ వదిలేయ్ సామీ..!

దిల్ రాజు .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ . ఒక సినిమా కథ విని ఆ కథ జనాలకి నచ్చుతుందా ..?నచ్చదా..? ఒకవేళ నచ్చితే ఏ తేదీన రిలీజ్ చేయాలి. ఎలాంటి మూమెంట్లో రిలీజ్ చేయాలి ..?ఎప్పుడు రిలీజ్ చేస్తే సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది..? సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంటే జనాలు అట్రాక్టివ్ గా చూస్తారు..? ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్స్ కి రావాలి అంటే ఎలాంటి కంటెంట్ ఉండాలి..? అని కథ విని గెస్ చేసే సత్తా ఉన్న ప్రొడ్యూసర్ డిస్టర్బ్యూటర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు అంటే దిల్ రాజుల్లో ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు .

అయితే దిల్ రాజు నమ్మి ఒక కథను ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయ్య ఛాన్సే లేదు . కానీ కొన్ని విషయాలలో దిల్ రాజు తీసుకున్న నిర్ణయాలు ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యేలా చేశాయి .మరీ ముఖ్యంగా దిల్ రాజు భారీ హిట్ అవుతాయి అంటూ చాలా ఆశలు పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ తో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రెండే రెండు ఫ్లాప్ అవ్వడం అభిమానులకే కాదు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి .

ఆ రెండూ కూడా ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కడం గమనార్హం. ఆ సినిమాలు మరేవో కాదు శ్రీనివాస కళ్యాణం . నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఇది ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ విలువలు తెలిపే సినిమా . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు దిల్ రాజు . అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాపై కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . బాగా ప్రమోట్ చేశారు . ఈ సినిమా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఎక్స్ప్రెస్ చేస్తుంది . ఈ సినిమా కూడా ప్లాప్ అయింది . దీంతో దిల్ రాజుకి ఫాన్స్ స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. ఇక అలాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు..!