ప్రభాస్ ‘ కల్కి ‘ కోసం రంగంలోకి సూప‌ర్ స్టార్.. నాగ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తాను నటించిన సినిమాలకు రూ.300 కోట్ల వరకు గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొడుతున్న ప్రభాస్.. చివరిగా నటించిన సలార్ తో భారీ హీట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ రేంజ్‌లో హిట్ అందుకుని దాదాపు 6ఏళ్ళు అవుతుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మరో పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 ఏడి లో ప్రభాస్ నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు.

Kalki 2898 AD Deal To Be The Highest In AP And TS | cinejosh.com

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే యూనివర్సల్‌ హీరో కమల్ హాసన్ ఈ మూవీలో ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, దిశా పటాన్ని ఇలా భారీ తారాగణం అంతా మూవీలో భాగం కావ‌డంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ ఏర్ప‌డింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ గ్లింప్స్‌.. సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. అయితే తాజాగా కల్కి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీమహావిష్ణువు దశావతారమైన కల్కిగా కనిపించనున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్‌ని విష్ణు అవతారంలో పరిచయం చేయడం కోసం మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారట.

Mahesh Babu Busy With His Personal And Professional Commitments |  cinejosh.com

దీనికోసం ఆల్రెడీ నాగ అశ్విన్ టీం మహేష్ ను కలిసినట్లు, తెలుగులో మహేష్ తో డబ్బ్‌ చెప్పించినట్లు.. ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలతో చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో ఆడియన్స్ లో మరింత ఆశ‌క్తి పెరిగింది. అలాగే మరోవైపు ఇంకా కొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్ సినిమాలో కనిపించబోతున్నారంటూ.. ఆ సర్ప్రైజ్లు తెలియాలంటే జూన్ 27 వరకు వేచి చూడాల్సిందే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మూవీని అశ్వినీ ద‌త్త్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయాలని మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాడు అశ్విన్.