ఆ విషయంలో చిరంజీవి నిజంగా అన్ లక్కీనే.. ఎందుకంటే..?

ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న చిరంజీవి.. పక్కాగా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. చిరంజీవి అంటే ఒక రుద్రవీణ ..ఒక ఠాగూర్ లాంటి సినిమాలో గుర్తొస్తాయి . అయితే అలాంటి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో పరమ చెత్త కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఉండడంతో ఆయన ఇమేజ్ డామేజ్ అయిపోతూ వస్తుంది .

కాగా ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు మెగా అభిమానులు . ఇలాంటి క్రమంలోనే ఒక వార్త బాగా వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి – శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాలను మిస్ చేసుకున్నారట. రెండు కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలు కావడం గమనార్హం . అందులో మొదటిది జెంటిల్ మ్యాన్..

అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అర్జున్ కెరీర్నే మలుపు తిప్పింది . అదేవిధంగా అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాను కూడా తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కించాలనుకున్నాడట శంకర్. అయితే అప్పట్లో చిరంజీవి కాల్ షీట్స్ ఫుల్ బిజీబిజీగా ఉండడంతో ఈ కథను రిజెక్ట్ చేశారట. ఇలా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు చిరంజీవి . అంతే కాదు కెరియర్ లో ఎంతో మంది డైరెక్టర్లతో వర్క్ చేసిన చిరంజీవి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయలేకపోయారు .. ఆ విషయంలో నిజంగా చిరంజీవి అన్ లక్కి నే అంటున్నారు కోలీవుడ్ జనాలు..!!