ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ ఫ్యాన్ ఏం చేశాడో తెలుసా.. ఇది రియల్ అభిమానం అంటే..?!

సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరో హీరోయిన్‌ల‌కు స్టార్ సెలబ్రిటీల‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక వారి అభిమాన హీరో, హీరోయిన్ల కోసం అభిమానులు ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేస్తూ హైలెట్ అవుతూనే ఉంటారు. కొందరు రక్తదానం, అన్నదానం లాంటి పనులతో వారి ఫేవరెట్ హీరోలపై అభిమానం చాటుకుంటే.. మరి కొందరు వారి ఫోటోలను టాటూలుగా వేయించుకుంటూ తమ అభిమానాన్ని చూపిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ఫేవరెట్ హీరో పై అభిమానాన్ని చూస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్లను కలవడం కోసం ఫాన్స్ పాదయాత్రలో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలా తాజాగా ఎన్టీఆర్ కోసం అభిమాని ఏకంగా 300 కిలోమీటర్లు ఎండలో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసి హాట్ టాపిక్‌గా మారాడు. తన ఫేవరెట్ హీరోను కలవాలని ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం గాపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు 300 కిలోమీటర్లు పాదయాత్ర 9 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగించాడు. ఎన్టీఆర్‌ను కలవడానికి ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేశాడు. వేసవికాలం కావడం చెప్పులు లేకపోవడంతో ఆయన కాళ్లకు బొబ్బలు కూడా వచ్చాయి. అయినా వెనకడుగు వేయకుండా ఎండని లెక్కచేయకుండా అలానే పాదయాత్ర చేసుకుంటూ ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నాడు.

N.T. Rama Rao Jr. - IMDb

అయితే హీరో ఇంట్లో లేడని తెలిసినా ఆయనపై అభిమానంతో హీరో రాక కోసం రెండు వారాలపాటు ఇంటి ముందే ఎదురు చూశాడు. చివరకు ఎన్టీఆర్ ను కలిసి తను అనుకున్నది సాధించాడు. ప్రస్తుతం నాగేంద్రబాబు చేసిన పని వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనికి ఫీదా అవుతున్నారు. మ‌రి కొందరు ఇదెక్కడి అభిమానం రా బాబు.. చెప్పులు వేసుకుని నడిచిన పాదయాత్ర అంటారు కదా.. హీరోపై అభిమానంతో కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొట్టాల శివ డైరెక్షన్లో దేవరతో పాటు బాలీవుడ్ వార్ 2 సినిమాలను బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు.