కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో ఛాన్స్ లు రావడానికి కారణం వాళ్లేనా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లుగా ఎదిగిన తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు మన హీరోయిన్స్. మెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కబ్జా చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులు, ఓటీటీ అని తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తమ సత్తా చాటుతున్నారు. అలా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారాతో ఓ విషయంలో పోటీకి సిద్ధమైంది కీర్తి సురేష్. ఆల్రెడీ అల్లుకుపోతున్న రష్మికను కీర్తి ఫాలో అయిపోతున్నారంటూ నెటింట‌ చర్చలు మొదలయ్యాయి. గ్లామర్ ఇండస్ట్రీలో పుష్పాతో సడన్గా బాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది రష్మిక.

Rashmika Mandanna Keerthy Suresh | Bollywood outfits, Best dressed award,  Indian actress hot pics

శ్రీవల్లి గా మంచి పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు ఈ సినిమాతో నేషనల్ క్రష్ గా క్రెజ్‌ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాతో ఏర్పడిన క్రైజ్‌తో వెంటనే సందీప్ రెడ్డి యానిమల్‌లో అవకాశాన్ని దక్కించుకొని సక్సెస్ అందుకుంది. దీంతో బాలీవుడ్ లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన సికిందర్ సినిమాలో నటిస్తోంది. వరుస‌ అవకాశాలతో దూసుకుపోతున్న రష్మికను కీర్తి ఫాలో అవుతుందని అలా పరోక్షంగా కీర్తి సురేష్ బాలీవుడ్ అవకాశాలకు రష్మిక హెల్ప్ అవుతుందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సౌత్‌లో బిజీ బిజీగా గడుపుతున్న కీర్తి.. ప్రియదర్శన్ డైరెక్షన్లో అక్షయ్ కుమార్ సరసన నటించనుందని టాక్. అయితే ఈ సినిమాలో ఆమెను తీసుకోవడానికి కారణం కూడా సౌత్‌లో బిజీగా ఉండడమే అని తెలుస్తుంది. ఇక సినిమా కోసం కియారాను కూడా అనుకుంటున్నటు సమాచారం. ప్రస్తుతం కియారా వర్సెస్ కీర్తి సురేష్ అంటూ పోటీ సాగుతుందట. ఇక ఈ పోటీలో చివరకు ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.