కెరీర్ లో మొదటిసారి లేడి విల‌న్‌తో త‌ల‌ప‌డ‌నున్న బాలయ్య.. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే..?!

నిన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి దిగనున్నారు. బాబీ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్బికె 109 షూటింగ్లో ఆయన త్వరలోనే పాల్గొంటాడ‌ని స‌మాచారం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారింది. ఇందులో శ్రియ రెడ్డి ప్రతినాయకురాలుగా నటిస్తుందంటూ సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే బాలయ్య, శ్రీయ రెడ్డి పై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారట.

Nandamuri Balakrishna NBK109 glimpse is out now! | cinejosh.com

ప్రతినాయకగా నటించడంలో శ్రియ రెడ్డి దిట్ట అన్న సంగతి తెలిసిందే. గతంలో వ‌చ్చిన‌ పొగరు సినిమా నుంచి.. నిన్న మొన్న వచ్చిన సలార్‌ సినిమా వరకు ఏమి చేసిన ప్రతినాయక పాత్రలు ఎంతగా హైలైట్ అయ్యాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్‌లో రాధార‌మా మ‌న్నార్‌గా పవర్ఫుల్ పాత్ర పోషించిన ఈ అమ్మడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంది, ప్రస్తుతం బాలయ్య సినిమాలో ఆమె నటించనున్న ఈ పాత్ర కూడా అంతే రేంజ్ లో ఆకట్టుకుంటుందని సమాచారం.

I Told Prashanth Neel I Wanted to Play A Character As Good As His Male  Heroes: Sriya Reddy

ఇన్నాళ్లు పవర్ ఫుల్ విలన్లతో ఢీ కొట్టిన బాలయ్య తన కెరీర్ లో మొదటిసారి స్ట్రాంగ్ లేడీ విల‌న్‌తో తెలపడనున్నాడని వార్తా వైరల్ గా మారింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మ‌రింత ఆసక్తి మొదలైంది. సినిమా రిలీజ్ తేదీని అతి త్వరలోనే మేకర్స్‌ ప్రకటించనున్నారట‌. ఇక‌ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నుంచి వ‌స్తున్న సినిమా కావడం.. అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాబి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.