బుజ్జిని పరిచయం చేసిన డార్లింగ్.. ప్రభాస్ లైఫ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒక‌టి. భారీ అంచనాలతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్క‌నుంది. ఇక‌ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ దాగ్గ‌స న‌టుడు అమితాబచ్చన్, దిశ పఠాని, క‌మ‌ల్ హాస‌న్‌ ఇలా భారీతారాగణం అంతా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ను పూర్తి చేసుకున్న కల్కి.. మే 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావలసింది.. కాగా ఎన్నికల నేపథ్యంలో సినిమాను జూన్ 27కు వాయిదా వేశారు మేకర్స్. అయితే పోస్ట్‌పోన్ చేసిన ఎప్ప‌టిక‌ప్పుడు క్రేజీ అప్డేట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Prabhas going to get married? This special post was written for Darlings

దీంతో ప్రభాస్ మూవీ గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. అయితే ఇటీవల ప్రభాస్ కూడా వరుసగా తన ఇన్స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్లు షేర్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ రాబోతున్నారు.. వెయిట్ చేయండి డార్లింగ్ అంటూ మొదలుపెట్టి.. తర్వాత నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ వివరించాడు. దీంతో అసలు బుజ్జి ఎవరు.. ఎలా ఉంటుంది.. అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. అదే టైంలో కల్కి మేకింగ్ సంబంధించిన ఆసక్తికర వీడియోతో స్క్రాచ్ అంటూ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తూ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు మేకర్స్. ఇక తాజాగా ఇంట్రెస్టింగ్ వీడియో ఎపిసోడ్ 4 రిలీజ్ చేశారు.

Kalki2898AD Bujji Robot Time | Kalki2898ad Bhairava Bujji Teaser time | Prabhas Bujji Coming - YouTube

ఇందులో ప్రభాస్ చెప్పిన బుజ్జి ఎవరో ప్రేక్షకులకు చాలా సేపు వెయిటింగ్ తర్వాత రివిల్ అయింది. ఎపిసోడ్ ఫోర్ గ్లింప్స్ వీడియోలో ఓ చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తున్నారు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే బుజ్జి కి మహానటి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నా లైఫ్ ఏంటి బాడీ లేకుండా బతికేయాల్సిందేనా అంటూ బుజ్జి క్యూట్ గా మాట్లాడుతుంటే.. ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి నీ టైం వచ్చింది బుజ్జి అంటూ తన వాహనం గురించి వివరిస్తాడు. అయితే ఇంతలో మరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు మేకర్స‌ట్. బుజ్జి గురించి పూర్తిగా తెలియాలంటే మే 22 వరకు వేచి చూడాల్సిందే అంటూ వివరించారు. ఈ స్క్రాచ్ ఎపిసోడ్ 4 వీడియో ప్ర‌స్తుతం తెగ‌ వైరల్‌గా మారింది.