” సలార్ 2 “లో కొత్త విలన్.. మరోపాన్ ఇండియా నటుడిని రంగంలోకి దింపిన ప్రశాంత్ నిల్..?!

రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సలార్ శౌర్యంగా పర్వం సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించిన స‌లార్ రెండో భాగం భారీ అంచనాల మధ్య తెరకెక్క‌నుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారింది.

Salaar 2 - IMDb

సలార్ సినిమాలనే సలార్ 2 కూడా భారీ కాస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం మరో పాన్ ఇండియన్ నటుడిని ప్రశాంత్‌ నీళ్లు ఎంపిక చేసినట్లు సమాచారం. అతను మరెవరో కాదు షైన్ టామ్‌ చాక్. నాని దసరా సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఆయన.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా ఇప్పుడు ఈ మలయాళ నటుడు ప్రభాస్ శౌర్యంగా పర్వంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ఇక టాలీవుడ్ లో ఈ సినిమా ఈయనకు ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.

The dark horse of Dasara. Why is no one talking about him? I felt he  delivered an excellent performance alongside Nani. : r/tollywood

ప్రశాంత్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హేంబలే ఫిలింస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంది. పృధ్వీరాజ్ సుకుమారన్‌, శృతిహాసన్, బాబీ సింహా, జగపతిబాబు, శ్రియ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రవి బసౄర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు రాజా సాబ్‌, కల్కి, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీ లేనప్ ఏర్పరుచుకున్నాడు.