“ఆ పని భార్య చేస్తే తప్పు..అక్క చేస్తే తప్పు రాదా..?” స్టార్ డైరెక్టర్ ని అడిగి కడిగి పాడేసిన అనసూయ..!

సోషల్ మీడియాలో.. అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఫ్కోర్స్ జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనసూయ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మెప్పించడమే . కాగా ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడేసే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలపై రివ్యూస్ ఇస్తూ ఉంటుంది .

అంతేకాదు పలు కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో కూడా తనదైన స్టైల్ లో రెస్పాండ్ అవుతూ ఉంటుంది . కాగా అర్జున్ రెడ్డి సినిమా టైంలో విజయ్ దేవరకొండపై ఎలా విరుచుకు పడ్డిందో మనం చూసాం. ఆ టైంలో ఆ ఇష్యూ పెద్దగా మారింది . తాజాగా సందీప్ రెడ్డివంగాకు చురకలు అంటించింది అనసూయ . యానిమల్ మూవీలోని రెండు సీన్స్ షేర్ చేసిన అనసూయ .. “అబ్బాయిలు భార్య విషయంలో ఇలా అక్క విషయంలో అలా ఎలా ఉంటారు.. హైపోక్రసీ(కపటత్వం).. మీరు నన్ను హిపోక్రైట్ అంటారా? అని కామెంట్ పోస్ట్ చేసింది. అంతే దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అనసూయ పేరు మారుమ్రోగిపోతుంది .

అంతేకాదు యానిమల్ సినిమాపై చాలా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు . నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కానీ సినిమా మాత్రం దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసింది . దానికి కారణం ఆ సినిమాలో ఉన్న బోల్డ్ కంటంటే అంటూ జనాలు చెప్పుకొచ్చారు. యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ శత్రువు మీద యుద్ధానికి వెళ్తూ భార్య రష్మిక మందన్నాతో నేను తిరిగి వస్తానో రానో తెలియదు ..నువ్వు మాత్రం మరో పెళ్లి చేసుకోకు అంటాడు ..అదే రన్బీర్ కపూర్ సొంత బావను చంపేసి అనంతరం అక్కకు రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు . ఈ పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!