ఎన్టీఆర్ కు పోటీగా రంగంలోకి దిగనున్న బాలయ్య.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాను నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విల‌న్ పాత్రలో మెప్పించనన్నారు. ఇక ఇదే సినిమాలో సలార్ విలన్ శ్రియ రెడ్డి కూడా ప్రతి నాయకురాలుగా బాలయ్య తో త‌ల‌ప‌డ‌నుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

NBK 109 | బాల‌య్య బ‌ర్త్‌డే స్పెషల్.. బాబీ ఎన్‌బీకే 109 ఎక్జయిటింగ్‌  అప్‌డేట్‌-Namasthe Telangana

ఇటీవల ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికలు హడావిడి ముగియడంతో తిరిగి యాక్షన్ మోడీకి వచ్చేసాడు. ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను అది విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. అయితే బాలయ్య మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్, టైటిల్ ఒకేసారి అనౌన్స్ చేయల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్‌.

Devara Part One: NTR Jr's film to now release on October 10. See the new  poster | Telugu News - The Indian Express

ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ కూడా మేకర్స్ తాజాగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అక్టోబర్ 10న దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇదే రోజున ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఇంకా ముందే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దేవర మేకర్స్. దీంతో బాలయ్య సినిమాను ఈ డేట్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే దేవర సినిమా అక్టోబర్ 10 న రిలీజై.. బాలయ్య సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తే మాత్రం వీరిద్దరి మధ్య పోరు స్ట్రాంగ్ గా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే ఎన్బికె 109 రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేగానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.