ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియ‌న్‌.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!

సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుల్లితెర నటి పవిత్ర జ‌య‌రామ్‌ కార్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటన నుంచి కోలుకోక ముందే మరో స్టార్ నటి కారు ప్రమాదానికి గురవడంతో న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. అయితే కార్ ప్త‌మ‌దానికి గురైన ఆ నటి ప్రస్తుతం ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడింది. దీంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ఆమె మరెవరో కాదు జబర్దస్త్ కమెడియన్ పవిత్ర.

Accident ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్.. కారు  నుజ్జునుజ్జుగా! | jabardasth Comedian pavitra met with Serious car accident..  Shocking video viral in Social media - Telugu ...

ఈ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న లేడీ కమెడియన్ లో పవిత్ర ఒకటి. అతి తక్కువ టైంలోనే తనదైన కామెడీతో స్టార్ కమెడియన్ గా మారిన ఈ అమ్మడు.. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇటీవల పలు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ పవిత్ర కార్‌కు ఘోర ప్రమాదం జరిగింది. దీంతో కారు బాగా చాత్త‌య్యింది. ఈ విషయాన్ని వీడియో ద్వారా ఆమె స్వయంగా అభిమానులతో షేర్ చేసుకుంది.

Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online  Telugu News Today

కారు అదుపుతప్పి బోల్తా పడింది అంటూ పవిత్ర వివరించింది. అయితే ఈ ప్రమాదంలో తమ ప్రాణాలతో బయటపడినట్లు చెప్పుకొచ్చింది. చిన్న చిన్న గాయాలతో అందరం బయటపడ్డామంటూ ఆమె షేర్ చేస్తూ ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెటింట‌ వైరల్ అవుతుంది. అయితే కారు డ్యామేజ్ అయ్యినా ఆమె చిన్న గాయాలతో బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.