సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్న ఈ అబ్బాయ్ ఎవరో గుర్తుపట్టారా.. అమ్మాయిలు పడి చచ్చిపోతారంతే..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే.. అందం ఎంత ఇంపార్టెంటో..? సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అంటే అబ్బాయిలకి ఫిజిక్ బాడీ కటౌట్ అన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ ..మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సిక్స్ ప్యాక్స్ బాగా ట్రెండ్ గా మారిపోతుంది . ప్రతి ఒక్క హీరో కూడా సిక్స్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్రదర్ నే ఈ ఆనంద దేవరకొండ.

అన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. అయితే పెద్దగా ఆయన పేరు జనాలలోకి ఎలివేట్ కాలేకపోయింది. ఆయన పేరు మారు మ్రోగి పోయేలా చేసిన సినిమా ఏది అంటే మాత్రం బేబీ అని చెప్పక తప్పదు . చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది . ఆనంద్ దేవరకొండ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది .

ప్రజెంట్ ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో రాబోతున్నాడు . ఆనంద్ హీరోగా ప్రగతి శ్రీనివాస ..నయన్ సారిక హీరోయిన్స్ గా హైలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వంశీ కారుమంచి అలాగే కేదార్ సెలగం శెట్టి నిర్మాణంలో ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . తాజాగా ఆనంద్ దేవరకొండ కి సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండ కండలు బాగా పెంచాడు . సిక్స్ ప్యాక్ బాడీని బిల్డప్ చేసుకున్నాడు . దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి..!!