మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్.. జక్కన్న మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక జక్కన్న సినిమా అంటే ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవ‌కాశ‌లు ఉండవన్న సంగతి తెలిసిందే. కానీ సినిమా గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ కీలకమైన‌ విలన్ పాత్ర కోసం ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్.

Prabhas Prithviraj Sukumaran and Team Salaar are all smiles at success  party - India Today

ఇందులో భాగంగానే ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్‌ను ఈ సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరో అనుకుంటున్నారా.. సలార్ సినిమాలో ప్రభాస్ ప్రాణ‌ స్నేహితుడిగా వరదరాజమన్నార్‌ పాత్రలో నటించి మెప్పించిన పృథ్వీరాజ్. మళ‌యాళ‌ నటుడు పృథ్వీరాజ్ ఈ సినిమాలో ఓ విలన్ పాత్రలో నటించనున్నాడని టాక్ వైరల్ గా మారింది. ఇక సలార్ తో పృథ్వీరాజ్ కు భారీ పాపులారిటి దక్కింది. అలాగే బడే మియా చోటే మియా సినిమాలోను మెప్పించాడు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచినా పృధంవిరాజ్ నటనకు మంచి ప్రశంసలు అందాయి. అయితే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 కోసం పృథ్వీరాజ్‌ను కలిశారని.. ఆయన డేట్ ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Rajamouli and Mahesh Babu Filmmakers Deny Casting Rumours On SSMB 29 |  Times Now

రాజమౌళి సినిమా అంటే ఎటువంటి స్టార్ నటులైనా నటించాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలో పృధ్వీరాజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్ అనిమల్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ నెల 31న మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారట‌. ఇక రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఎంత గోప్యంగా ఉంచాలని చూసినా ఎప్పటికప్పుడు అవి వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాటిలో ఫేక్ న్యూస్ లు కూడా వైరల్ అవ్వడంతో.. తాజాగా మేకర్స్ అదంతా ఫేక్ న్యూస్ అని.. ఫేక్ క్యాస్టింగ్ కాల్ హల్చల్ చేయడానికి నమ్మవద్దంటూ కొట్టి పారేశారు.