సుకుమార్ సంచలన నిర్ణయం.. పుష్ప 2 కోసం ఏకంగా ఇండియాలోనే అలా చేయబోతున్నాడా..?

సుకుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల డైరెక్టర్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? ఏ సినిమాను తెరకెక్కించిన సరే తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తాడు. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ సమానంగా చూపించడం సుకుమార్ సినిమాలో మనం బాగా గమనించొచ్చు. ప్రెసెంట్ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. బన్నీ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఈ సినిమాపై గ్లోబల్ స్దాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు బన్నీ అభిమానులు . ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు బన్నీ ఫాన్స్ . తాజాగా ఈ సినిమా కోసం నిర్ణయం తీసుకున్నాడు సుకుమార్ అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. జనరల్ గా ఎవరైనా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి ఆ లొకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ షూట్ చేస్తారు.. కానీ సుకుమార్ మాత్రం పుష్ప2 కోసం ఏకంగా ఫారిన్ కంట్రీస్ లో ఉండే లొకేషన్స్ ఇండియాలో సెట్ వేయించబోతున్నాడట .

మలేషియాలో ఉన్న ఒక స్పెషల్ లొకేషన్ తాలూకా సెట్ ను పుష్ప2 కోసం ఇండియాలో వేయించబోతున్నారట. అది కూడా మన హైదరాబాదులో కావడం గమనార్హం. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అయిపోతుంది . సుకుమార్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు ..దట్ ఈజ్ సుకుమార్ అంటున్నారు అభిమానులు. కాగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది అన్న రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు..!!