అమ్మ బాబోయ్.. విడాకులు తీసుకున్న ఆ జంట మళ్లీ కలవబోతుందా..? ఫ్యాన్స్ టెన్షన్..!

ఏంటో.. విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మళ్లీ కలుసుకోవడం.. ఏంటి ..?ఈ తలనొప్పి అని కొందరు అంటుంటే.. పోనీలే ఇన్నాళ్లకైనా కలవబోతున్నారా..? హ్యాపీగా ఉండండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ ఫ్యాన్స్ ని అయోమయానికి గురిచేస్తుంది. మరి ముఖ్యంగా అది నాగచైతన్య సమంత విషయానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతుంది . ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు సమంతా నాగచైతన్య కలవబోతున్నారా..? అంటూ ఎదురుచూసిన జనాలకు ఈ విషయం బాగానే అనిపించినా .. ఇది మాత్రం జరిగే పని కాదు మొత్తం ఫేక్ అంటూ కొట్టి పడేసే అభిమానులు కూడా ఉన్నారు.

విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన మనం సినిమా గుర్తుందిగా . మర్చిపోయే రేంజ్ సినిమా నా అది. ఇందులో నాగేశ్వరరావు – కింగ్ నాగార్జున – నాగ చైతన్య- అఖిల్ – సమంత – శ్రేయ శరణ్ – అమల కీలక పాత్రలో నటించి మెప్పించ్చారు. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది . ఈ సినిమా విడుదలై ఏకంగా పదేళ్లు పూర్తయింది . కాగా ఈ విషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా ఒక అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో మనం స్పెషల్ షోను ఏర్పాటు చేశారు . అయితే ఓ ఈవెంట్ ని కూడా అక్కినేని ఫ్యామిలీ నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దానికోసం ఈ సినిమాలో కలిసి వర్క్ చేసిన నటీనటులు హాజరు కావాలి అంటూ పక్కాగా నిర్ణయం తీసుకున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం సమంతకి కూడా ఈవెంట్ కి ఇన్విటేషన్ పంపించారట . అయితే సమంత వస్తుందా..? రాదా ..? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది సమంత వస్తుంది అంటుంటే మరి కొంతమంది సమంత చచ్చినా అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టదు అంటూ తేల్చేస్తున్నారు . ఏమో నాగచైతన్య అదృష్టం బాగుంటే మళ్ళీ కలవబోతున్నారేమో.. ఇద్దరూ అంటూ మాట్లాడుకునే జనాలు కూడా ఉన్నారు..!!