మళ్ళీ అభిమానుల కోసం అలా చేయబోతున్న తారక్..ఇక రచ్చ రచ్చే..!!

కేవలం కొద్ది గంతలే.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే రాబోతుంది.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే అంటే సోషల్ మీడియాలో ఎలాంటి హంగామా నెలకొంటుందో మనకు తెలిసిందే. రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . అర్ధరాత్రి నుంచే కటౌట్లు భారీ భారీ ఫ్లెక్సీలతో అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ . కాగా రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న వార్ 2 సినిమాకి సంబంధించి ఓ న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో షర్ట్ లేకుండా ఒక 10 నిమిషాల పాటు కనిపించబోతున్నాడట. సిక్స్ ప్యాక్స్ ని చూపించబోతున్నాడట. గతంలో ఆయన షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్స్ చూపించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి .

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాలో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్స్ తో కనిపించాడు తారక్ . ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాలా ..? ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ సినిమాలోనూ సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తాడు .. షర్ట్ లేకుండా .. ఆ సినిమా కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ లో తారక్ షర్ట్ లేకుండా కనిపిస్తాడు ..ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకవేళ అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మాత్రం వార్ 2 సినిమా రచ్చ రంబోలా రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్క అంటున్నారు జనాలు. ఈ న్యూస్ ని ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్..!!