“ప్లీజ్ నా ప్రేమను అర్ధం చేసుకోండి”..సెన్సేషనల్ వీడియోని షేర్ చేసిన నాగ చైతన్య(వీడియో)..!!

నాగచైతన్య .. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా బాగా కష్టపడుతున్నాడు . అఫ్ కోర్స్ అక్కినేని నాగచైతన్యకు ఒక ట్యాగ్ ఉంది . కానీ ఆ ట్యాగ్ కొంతవరకే ఉపయోగపడుతుంది . నాగచైతన్య తన సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయాలు అక్కినేని ఫాన్స్ ని కూడా డీప్ గా హర్ట్ చేస్తూ ఉంటాయి . కాగా ప్రజెంట్ నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం విశేషం .

రియల్ ఇన్సిడేంట్స్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించబోతూ ఉండడం సినిమాకి హైలెట్గా మారిపోతుంది . మరొక విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతుంది. కాగా రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా మనం . ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది , ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి పలు స్పెషల్ షోస్ వేస్తున్నారు .

నాగచైతన్య కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మనం డైలాగ్స్ చెబుతూ వీడియో ఒకటి నెట్టింట రిలీజ్ చేశారు . ఆ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వారు యూట్యూబ్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది . ఇందులో నాగచైతన్య ..”నా ప్రేమని అర్థం చేసుకోండి.. మీ ప్రేమను నాకు తిరిగి ఇవ్వండి.. ప్రేమను మీరు ఎంత ప్రేమించారో ..అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను ..ప్రేమను ప్రేమగా చూసుకుంటాను అంకుల్ “అని మనం సినిమాలో చెప్పే డైలాగ్ ని మరొకసారి చెప్పాడు . ఈ వీడియో ఇప్పుడు చాలా చాలా బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!