ఆ స్టార్ హీరో లైఫ్ లోకి అదృష్ట దేవత వచ్చేసిందిరోయ్.. లక్కి ఛాన్స్ కొట్టాడుగా..!

నితిన్ .. పాపం ఇండస్ట్రీలో హిట్ కోసం అల్లాడిపోతున్న హీరో.. ఎంతలా అంటే మంచి మంచి డైరెక్టర్ అవకాశాలు ఇస్తున్న సరే నితిన్ క్రేజీ హిట్ కొట్టలేకపోతున్నాడు.. తప్పు డైరెక్టర్ దా..? లేకపోతే నితిన్ దా..? అన్నది కూడా తెలియడం లేదు . సినిమాల కథ కంటెంట్ సరిగ్గా చూసుకోవడం లేదు .. నితిన్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇప్పుడు నితిన్ ఒక్క హిట్టు కొట్టకపోతే పరిస్థితులు చాలా చాలా మారిపోతాయి.. కెరియర్ చేజారిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు నితిన్.

అందుకే సినిమాల కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు . తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు నితిన్ . ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హిట్ టైటిల్ తమ్ముడు అంటూ పెట్టుకోచ్చారు. ఈ సినిమా ద్వారా క్రేజీ హీరోయిన్ లయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది . అంతేకాదు ఈ సినిమా లో హీరోయిన్గా హాట్ బ్యూటీ రాశీ ఖన్నా అనుకున్నారట.

కానీ లాస్ట్ మూమెంట్లో రాశీ ఖన్నా ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఆ కారణంగానే ఈ సినిమాలో ఇప్పుడు క్రేజీ బ్యూటీ సప్తమి గౌడను చూస్ చేసుకున్నారట. కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకునింది సప్తమి గౌడ . తెలుగులో పలు ఆఫర్స్ కూడా అందుకుంటుంది . సప్తమి గౌడ ఇప్పుడు నితిన్ పాలిట లక్కీ దేవతగా మారబోతుంది అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఈ హీరో తలరాతను ఈ కన్నడ బ్యూటీ ఏ విధంగా మార్చబోతుందో..???