లక్కి ఛాన్స్ కొట్టేసిన కట్టప్ప..ఏకంగా ప్రధాని మోడీ ఛైర్‌లోనే కూర్చోబోతున్నాడుగా..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సత్యరాజ్. సత్యరాజ్ అన్న పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు.. అదే కట్టప్ప అంటే మాత్రం ఉయ్యాలలో ఉన్న చిన్నపిల్లలు కూడా గుర్తుపట్టేస్తాడు . అంతలా కట్టప్ప పాత్రతో పాపులారిటీ సంపాదించుకున్నాడు సత్యరాజ్ . కాగా ఆ తర్వాత ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించిన అలాంటి క్రేజ్ దక్కించుకోలేకపోయాడు . ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కట్టప్ప గానే పాపులారిటీ సంపాదించుకున్నాడు ..కట్టప్ప గానే గుర్తింపు దక్కించుకుంటున్నాడు సత్యరాజ్ .

కాగా రీసెంట్గా సత్యరాజ్ అద్దిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . వాళ్లు వీళ్లు కాదు ఈసారి ఏకంగా టార్గెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. త్వరలోనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో నరేంద్ర మోడీ పాత్రలో సత్యరాజ్ కనిపించబోతున్నాడట. అంతేకాదు ఇండియా కోసం ఆయన చేసిన సేవలు ఆయన తీసుకున్న డెసిషన్స్ క్లియర్ కట్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారట .

ప్రముఖ సినీ విశ్లేషకులు రమేష్ బాల శనివారం చేసి ట్వీట్ తో ఈ విషయంపై బయటపడ్డింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా సత్యరాజ్ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . 2019లో వివేక్ ఓబ్రాయి ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోడీ సినిమా విడుదల కాగా మరోసారి అలాంటి కాన్సెప్ట్ తోనే నరేంద్ర మోడీ బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాత్రలో సత్యరాజ్ ఏ మేరకు మెప్పిస్తాడో..?