బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఆరెంజ్ లో సక్సెస్ అందుకున్న ప్రభాస్ సినిమా సలార్. ప్రభాస్ నుంచి చివరిగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో.. విజయ్ తిరంగదూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.270 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.715 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. ఇందులో దేవ పాత్రలో ప్రభాస్ నటించగా.. వరదరాజు మన్నార్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన పృథ్వీరాజ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సలార్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మన్నార్ అతడు చేసిన పని ఒంటరిగా చేస్తే ఎంత కూల్ గా ఉండేవాడు అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. పృధ్వీరాజ్ స్పందిస్తూ.. ప్రస్తుతం నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో మన్నార్ కథ చాలా డిఫరెంట్. ఎంతో బాగుంటుంది. సలార్‌లో మన్నారు పాత్ర కోసం మరో ప్రపంచంలో క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుంది అంటూ వివరించాడు. దీంతో ఆ క్రేజీ క్రాస్ ఓవర్ ఏంటి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. మరో ప్రపంచంలో ఖచ్చితంగా యష్ ఉండే అవకాశం లేదు. ఇప్పటికే కేజిఎఫ్ సినిమాల్లో కనిపించిన నటీనటులు సలార్లో చాలామంది ఉన్నారు.
దీంతో సలార్ క్రాస్ ఓవర్ ప్రాజెక్టులో యష్‌ను మరోసారి తీసుకునే అవకాశం ఉండదని.. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారక్‌ను సలార్2లో భాగం చేయబోతున్నాడు అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై సలార్ మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒకవేళ సలార్ ప్రపంచంలో ఎన్టీఆర్ అడుగు పెడితే మాత్రం సినిమాపై మరింత హైప్ పెరగడం కాయం. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా దేవర షూటింగ్లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. తాజాగా వార్2 షూటింగ్లో పాల్గొని సందడి చేశాడు. హిందీలో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ నటిస్తున్న వార్2 లో తారక్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవనున్నాడు ఎన్టీఆర్. ఇక అక్టోబర్ 10 న దసరా కానుకగా దేవర మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.