వావ్: మళ్లీ కలిసిన నటించబోతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పేర్లు భలే ముద్దుగా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ మరింత హాట్ హాట్ గా ఉంటుంది అని..ఆ విషయంలో రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ జంట టూ గుడ్ అంటున్నారు జనాలు. ఒకప్పుడు నాగార్జున – టబు ల జంట ఇండస్ట్రీ ని ఏ రేంజ్ లో అల్లాడించేసిందో ఇప్పుడు అదే రేంజ్ లో అల్లాడించేస్తుంది విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ల జంట .

వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని.. పెళ్లి చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది . కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు ఈ స్టార్ సెలబ్రిటీస్. తాజాగా సోషల్ మీడియాలో ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఢమాల్ అంటూ తుస్సు అనే టాక్ దక్కించుకుంది .

ఆ తర్వాత ప్రతి విషయాన్ని ఆచుతూచి అడుగులు వేస్తున్నాడు విజయ్. కాగా రీసెంట్ గానే రాజావారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా కంటే ముందే టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుందట . ఇది ఫుల్ టు ఫుల్ క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ గా తెరకేక బోతుందట . ఇది తెలుసుకున్న అభిమానులు ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . గీతాగోవిందం లాంటి మరో సినిమా కచ్చితంగా విజయ్ ఖాతాలో పడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు..!!