దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో..?!

అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి బ్లాక్ బ‌స్టర్లతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్ పడకపోవడంతో సతమతమవుతున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసానితో హీరోగా మారి.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే తాజాగా వ‌చ్చిన‌ బేబీతో మొదటిసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా వీరి ఇద్దరి కాంబినేషన్లో మల్టిస్తారర్‌ సినిమా వస్తుందంటూ నటింట‌ వార్తలు వినిపించాయి.

Gam Gam Ganesha First Look: Anand Devarakonda holds guns and enters action  mode!

తాజాగా ఓ ఈవెంట్‌లో ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. అనంద్‌ దేవరకొండ నటించిన గంగం గ‌ణేషా సినిమా మే 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆనంద్ అందులో భాగంగా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే ఇంటర్వ్యూవ‌ర్‌ ఆనంద్‌ను ప్రశ్నిస్తూ విజయ్ తో కలిసి ఏదైనా మల్టీ స్టార‌ర్ అవకాశం ఉందా అని అడగగా.. ఇప్పటిదాకా మా మధ్య అలాంటి డిస్కషన్ జరగలేదు. చేస్తే బాగానే ఉంటుందేమో.. అయితే సెట్లో మా అన్నయ్య ఉంటే నేను నటించలేను.. కొంచెం షేక్ అవుతా.. గతంలో మాత్రం అన్నయ్యతో చెక్‌మేట్ అనే ఓ నాటకంలో థియేటర్ ఆర్టిస్ట్ గా నటించా అంటూ వ‌వ‌రంచాడు.

Gam Gam Ganesha Movie First Look Launch Event | Anand Deverakonda - YouTube

అందులో నేను విలన్ పాత్ర పోషించా. అయితే సినిమాల్లో మల్టీస్టారర్ అంటే ఎప్పటికీ జరుగుతుందో చెప్పలేను.. కానీ జరిగితే మాత్రం మంచిదే అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ నాటకంలో నటించారా అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్‌. అయితే వీరిద్దరూ కలిసి మల్టీ స్టార‌ర్ లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ కూడా దీనిపై పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడంతో సరైన కథ దొరికితే వీరిద్దరి మల్టీస్టారల్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే అలాంటి కంటెంట్ ఉన్న అద్భుతమైన కథ దొరికితే బాగుండని ఫ్యాన్స్ భావిస్తున్నారు.