బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మన భారత్లో రామాయణాన్ని ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా రామాయణం ఆధారంగా ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయినా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం నితీష్టివారి దర్శకత్వంలో వస్తున్న ఈ బాలీవుడ్ రామాయణ సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడి పాత్రలు కనిపించనున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
దాన్ని ప్రూవ్ చేస్తూ తాజాగా మొదలైన సినిమా షూట్లో సాయి పల్లవి, రణబీర్ సీతారాముల పాత్రల్లో కనిపించిన పిక్స్ వైరల్ అయ్యాయి. దేనితో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. అయితే ఇటీవల అల్లు అరవింద్, మధు మంతెన టీం ఫ్రేమ్ ఫోకస్ మీడియాతో ఒప్పందంలో భాగంగా రామాయణ్ టీం తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేదని.. సినిమాను నిర్మంచకూడదని ప్రకటన రిలీజ్ చేశారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై మేకర్స్ కానీ.. అటు అల్లుఅరవింద్ కానీ అఫీషియల్ గా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా గురించి మరో వార్త చకర్లు కొడుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూవీ టైటిల్ మార్చేసారట.
రామాయణ్ టైటిల్ను ఇప్పుడు గాడ్ పవర్ అని కొత్త టైటిల్ గా మార్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ముంబై ఫిలిం సిటీ లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు. ఈ సినిమా షూటింగ్ కనీసం 600 రోజుల వరకు జరుగుతుందని.. 2027లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాల్లో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్, లారా దత్త లాంటి స్టార్ కాస్టింగ్ అంతా కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.