‘ దేవర ‘ ఫస్ట్ సింగిల్ చూశారా.. ఎన్టీఆర్ క్యారెక్టర్ మొత్తం రివిల్ చేసేసారే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తాజాగా రిలీజ్ అయింది. నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ ఈ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు అనిరుధ్‌ గాని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ.. లిరిక్స్ కు కనెక్ట్ అయ్యేలా ప్లే చేస్తూ వచ్చారు. ఇక మొత్తానికి ఈ సాంగ్ లో ఎన్టీఆర్ ప్రళయకాల రుద్రుడిలా క‌నిపించాడు. భయానికి ధైర్యం తోడు ఉండాలి.. మరి ఆ ధైర్యం కూడా భయపడినప్పుడు దేవర తోడుగా ఉండాలి అంటూ ఈ సాంగ్‌తో దేవరపై హైప్‌ మరింతగా పెంచేశారు.

Devara First Single: Fear Song from Jr NTR-starrer Is A Pulsating Number | Times Now

అలాగే తారక్‌.. దేవర క్యారెక్టర్జేషన్ చూపించే ప్రయత్నం చేశారు. రామజోగ‌య్య శాస్త్రి. లిరిక్స్ తో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ రీవిల్ అయ్యిన‌టు అనిపిస్తుంది. మన అనుకున్న వాళ్లకోసం ముందు నిలబడే క్యారెక్టర్ గా దేవర ఉండబోతుందని అర్థమవుతుంది. ఆయన రాసిన ప్రతి పదం అద్భుతంగా అనిపిస్తుంది. ఇక అనిరుధ్ కెరీర్‌లో ఇంతకుముందు వర్క్ చేసిన సినిమాలన్నింటికంటే ది బెస్ట్ సాంగ్‌గా ఇది నిలిచిపోతుంది. వేరే లెవెల్లో మ్యూజిక్ ఉందని చెప్పవచ్చు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ దక్కించుకొని దూసుకుపోతుంది.

FEAR SONG WHATSAPP STATUS | DEVARA FIRST SONG | NTR | KORATALA SIVA | ANIRUDH RAVICHANDER | - YouTube

ఎన్టీఆర్ అభిమానులు ఈ పాట కోసం ఎంతగానో వేచి చూశారు. అయితే ఇప్పుడు అంతకుమించి ఎక్కువగా ఎగ్జిట్ అవుతూ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. దేవర ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవబోతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అనిరుధ్‌ ఇంతక ముందు సత్తా చాటుకున్న విక్రమ్, జైలర్ సినిమాలో మ్యూజిక్‌ కంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండనుందని టాక్ నడుస్తుంది. అయితే అదే నిజం అనిపించేలా ఈ సాంగ్ లో తన మ్యూజిక్ తో అదరగొట్టాడు అనిరుధ్‌. ఇక నేడు ఎన్టీఆర్ పుటిన‌రోజు సంద‌ర్భంగా నెటింట పుటిన‌రోజు విషెస్ తెలియ‌జేస్తున్నారు ఫ్యాన్స్‌.