భయంకరమైన లేడీని మహేష్ బాబు కోసం రంగంలోకి దింపుతున్న రాజమౌళి.. ఆ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు..!

రాజమౌళి .. తన సినిమాలో నటించే ప్రతి ఒక్క నటీనటుల విషయంలో ఎంత కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే . ఒకరిని ఒక పాత్రకు చూస్ చేసుకున్న తర్వాత రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాత్ర నుంచి వాళ్లను తప్పించరు . ఎందుకంటే ఆ పాత్రకు వాళ్ళు సూట్ అవుతారా..? లేదా..? అని దాదాపు నెల రోజులకు పైగానే ఆలోచించి మరి నిర్ణయం తీసుకుంటారు . అయితే రాజమౌళి సడన్గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి బిగ్ ప్లస్ గా మారబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు .

రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇంతవరకు మొదలు కాలేదు . కానీ హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎవరు హీరోయిన్లుగా నటించబోతున్నారు ..?అంటూ రకరకాల హీరోయిన్స్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీలక పాత్రల కోసం రవినాటండనను చూస్ చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది .

బాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసిన రవీనా ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తుంది. అంతేకాదు ఈమధ్య పలు వెబ్ సిరీస్ లో కూడా రెచ్చిపోయి నటించింది . కాగా ముందుగా ఈ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత ఆమెను తప్పించి రవినా తండనాని చూస్ చేసుకున్నారట. దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి..!!