సక్సెస్ ..ఆ విషయంలో మమితా బైజు గ్రాండ్ సక్సెస్.. అనుకున్నది సాధించిందిగా..!

మమిత బైజు.. ఒక శ్రీ లీల ..ఒక రష్మిక మందన్నా.. ఒక కీర్తి సురేష్ ..ఒక సమంత.. వీళ్ళందర్నీ మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఫిల్టర్ చేస్తే వచ్చే హీరోయిన్ మమితాబైజు.. ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీ స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లోనే ఉంటాయి . ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో ఇండస్ట్రీని షేక్ చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేనా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కంట్లో పడింది .

ఆమె నటనకు రాజమౌళి శాతం ఫిదా అయ్యాడు ..అంటే అమ్మడులో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమలు సినిమా తర్వాత మమితా బైజు పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది .ఆఫర్లు కూడా బాగానే పట్టేస్తున్నాయ్. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మమితా బైజు జాక్పాట్ ఛాన్స్ కొట్టేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . విజయ్ దేవరకొండ కెరియర్ లో 12వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో మమిత బైజు హీరోయిన్గా సెలెక్ట్ అయిందట .

ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయిందట. రేపోమాపో అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు ఇలా ఆమె ఆఫర్స్ రావడానికి కారణం కూడా ఆమెలో ఉన్న స్పెషల్ టాలంటే అంటూ చెబుతున్నారు. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న..తాను ఏ హీరోలతో నటించాలి అనుకుంటుందో ఆ హీరోలను ఓ రేంజ్ లో పొగిడేస్తుంది అని.. ఆ కారణంగానే హీరోలు కూడా మెల్ట్ . ఆమెకు ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది . టెంప్ట్ చేసిందో..మెల్ట్ చేసిందో .. మొత్తానికి అవకాశం అయితే పట్టేసింది . ఇక కుమ్ముడే అంటున్నారు మమిత ఫ్యాన్స్..!!