ఓరి దేవుడోయ్..యువతి ప్రాణం తీసిన పువ్వు..అసలు ఏం జరిగిందంటే..?

పుట్టుక ..మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఎవ్వరూ చెప్పలేము. అది అందరికీ తెలిసిందే . అయితే ఈ కలియుగాని స్మార్ట్ యుగముగా మార్చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఏం చేస్తున్నామో ..?ఎలా చేస్తున్నామో..? తెలియకుండా తయారైపోయింది పరిస్థితి . స్మార్ట్ ఫోన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి . అలాగే స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్నో నష్టాలు కూడా జరుగుతున్నాయి . మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ యువతీ యువకులను బలి తీసుకుంటుంది . తాజాగా ఓ యువతి లైఫ్ లో స్మార్ట్ ఫోనే యమపాసంగా మారింది . దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

చాలామంది ఫోన్లో మాట్లాడుతూ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు .అది ఎవరైనా సరే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు . ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అనే విషయాలను పూర్తిగా మర్చిపోతూ ఉంటారు . తాజాగా ఓ యువతి తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతూ మునిగిపోయింది . అలా తోటలో నడుచుకుంటూ సరదాగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో టైంపాస్ చేసింది . వెళ్తూ వెళ్తూ కరివేరు మొక్క నుంచి ఒక పువ్వుని తెంచి దానిని నోట్లో పెట్టుకొని తినేసింది. అప్పటికి కూడా యువతికి ఆమె ఏమి తింటుంది అనేది తెలియలేదు . చివరికి ఆ పువ్వు గురించి తెలుసుకొని ఉమ్మేసింది . అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది .

ఆ యువతి మరణించింది . ఈ విషాదం కేరళలో చోటుచేసుకుంది . 24 ఏళ్ల సూర్య సురేంద్రన్ యూకే లో నర్సుగా ఉద్యోగం వచ్చింది . యూకే వెళ్ళేందుకు అన్ని సిద్ధం చేసుకుంది . అయితే ఎయిర్ పోర్ట్ లో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది . వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది .. ఆసుపత్రికి తరలించారు . అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది . గుండెపోటు కారణంగా యువతి మరణించింది అంటూ వైద్యులు వెల్లడించారు . అంతేకాదు ఎయిర్ పోర్ట్ కి వచ్చే ముందు బంధువులు స్నేహితులతో మాట్లాడుతూ కర్వేరు పువ్వుని నమిలి తిన్నట్లు ఆ వెంటనే ఉమ్మేసినట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకు వచ్చిందట .

ఆ పువ్వులోని విషం కారణంగానే యువతి హార్ట్ ఎటాక్ కి గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. కరివేరు పువ్వుపై అధ్యయనం చేసిన డాక్టర్లు మాట్లాడుతూ..”ఆ పువ్వులో అల్కలాయిడ్స్ ఉన్నాయని.. అవి గుండె జబ్బు రావడానికి ప్రభావితం చేస్తాయి అని చెప్పుకొచ్చారు “. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!