సమ్మర్ లో ఏసీలు ఎక్కువుగా ఎందుకు బ్లాస్ట్ అవ్వుతాయో తెలుసా..? ఈ తప్పు మీరు చేయకండి..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ ఉంటుంది . మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న ఎండలకి ..ఉక్కపోతకు తట్టుకోలేక ..ఈఎంఐ లో ఏసీలు కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు . అయితే ఏసి ని కొనుక్కోవడం కాదు . చాలా జాగ్రత్తగా వాడడం ఇంపార్టెంట్ . తెలిసి తెలియక ఏసీ ని తప్పు తప్పుగా వాడేస్తే కొన్నిసార్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటున్నారు నిపుణులు . అయితే ఏసీ పేలడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. !!

*ఏసీ ఫిట్ చేసేటప్పుడు చాలా అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ చేతనే ఫిట్ చేయించుకోవాలి . అప్పుడు కరెక్ట్ వే లో ఏసీ ని ఫిట్ చేస్తారు .

*ఏసీ కంప్రెసర్ ఎక్కువగా వేడెక్కితే అది పేలిపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు .

*వైరింగ్ సరిగ్గా లేకపోవడం.. లేకపోతే లూస్ కనెక్షన్స్ ..అది కూడా కాకుండా షార్ట్ సర్క్యూట్ మొదలైన వాటి వల్ల ఏసీ పేలుడు సంభవించవచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు.

* చాలామంది ఏసి గంటలు గంటలు అలాగే రన్ చేస్తూ ఉంటారు . అది మహా మహా ప్రమాదం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*ఏసీ ని కొంచెం సేపైనా ఆఫ్ చేయాలి . రూమ్ కూల్ ఎక్కాక కనీసం అరగంట సేపైనా ఏసీ ని ఆఫ్ చేసి ఉంచడం ద్వారా ఈ పేలుడు నుంచి తప్పించుకుని ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు నిపుణులు.

*ఏసి బాగా వేడెక్కినా..? లేదా సరిగ్గా చల్లబడకపోయినా పేలిపోతుంది అంటూ కూడా హెచ్చరిస్తున్నారు.

*ఏసీలో సరైన నిర్వహణ లేకుంటే పేలిపోయే ప్రమాదం ఉంటుందట . మరీ ముఖ్యంగా సర్వీసింగ్ అనేది కంపల్సరీ అంటూ చెప్పుకొస్తున్నారు.

* కొన్నిసార్లు కరెంట్ హెచ్చుతగ్గుల కారణంగా ఏసీలో కొన్ని భాగాలు దెబ్బ తింటాయట. అందుకే దీని వల్ల కూడా ఏసీ బ్లాస్ట్ అవుతుంది అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు.