“ఆ విషయంలో నాదే తప్పు నమ్మకుండా ఉండాల్సింది”.. హీట్ పెంచేస్తున్న కొరటాల కామెంట్స్..!

కొరటాల శివ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ . నిన్న మొన్నటి వరకు కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటూ గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ . ఆచార్య సినిమా ఆ రికార్డును తుడిపేసింది . ఆచార్యతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల శివ. ఇప్పుడు ఆ రిమార్క్ ని చెరిపేయడానికి ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను తెరకెకిస్తున్నారు . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు కొరటాల శివ . ఎన్టీఆర్ కూడా కొరటాల శివకు బాగా సపోర్ట్ చేస్తున్నారు . అంతేకాదు ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ బయట పెద్దగా కనిపించలేదు. దేవర హిట్ తో మళ్లీ మీడియా ముందుకు రావాలి అంటూ డిసైడ్ అయ్యారు. అయితే సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేశారు కొరటాల శివ .

కాగా ఇప్పుడు రీసెంట్ గా కొరటాల శివ కి సంబంధించిన ఒక ఓల్డ్ న్యూస్ వైరల్ గా మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సింహ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . బాలయ్య కెరియర్ని మలుపు తిప్పింది . అంతకుముందు బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫ్లాప్స్ పడ్డ బాలయ్యకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందించింది . బాలయ్య – నయనతార – స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించారు . నిజానికి ఈ సినిమాకి డైరెక్టర్ బోయపాటి. కానీ రచయితగా కొరటాల శివ వర్క్ చేశారు .

అప్పటికి కొరటాల ఇంకా డైరెక్టర్ కాలేదు . ఆయన అందించిన కథ మాటలు సినిమాకి ఎంతో ప్లస్ అయ్యాయి. అయితే ఒకానొక టైంలో కొరటాల శివ బోయపాటికి మధ్య ఈ సినిమా కారణంగా బాగా గొడవలు వచ్చాయట . అయితే అది అప్పట్లోనే క్లియర్ అయిపోయింది అంట . ఓ ఇంటర్వ్యూల కొరటాల శివ ను హోస్ట్ ఇదే విషయం గురించి ప్రశ్నించగా ..”అది అంతా ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు అందరం బాగున్నాం ..స్టోరీ డైలాగ్స్ విషయంలో గొడవలు వచ్చిన మాట వాస్తవమే .. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు ..నేను మనస్థాపం చెందిన మాట కూడా వాస్తవమే.. నమ్మి మోసపోవడం చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది .. నాకు కూడా అలాగే జరిగింది ..అది నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం చేద్దాం .. జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి “అంటూ కొరటాల చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!