ఏంట్రోయ్..మహేశ్ బాబు పరమ చెత్త సినిమా టైటిల్ ని.. ప్రభాస్ అన్న మూవీకి పెట్టారు..?

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ లు సినిమా టైటిల్స్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాము. ఆఖరికి చిన్న చిన్న డైరెక్టర్స్ కూడా చిన్న హీరోలతో చిన్న బడ్జెట్ తో తెరకెక్కించే మూవీస్ విషయంలో చాలా కఠినంగా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది డైరెక్టర్స్ మాత్రం టైటిల్స్ విషయంలో చాలా నెగ్లెజెన్సీ బిహేవ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి లిస్టులోకే వచ్చాడు సీతారామం మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు .

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. వైరల్ కూడా అవుతుంది . అయితే దీనిపై ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ సంబర పడుతుంటే.. మరొక స్టార్ హీరో ఫ్యాన్స్ ట్రోలింగ్ గురి చేస్తున్నారు . హను రాఘవపూడి నెక్స్ట్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఓ అద్భుతమైన కథతో ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. సీతారామం మూవీ డైరెక్టర్ హనురాగవపూడి ఆల్రెడీ కొన్ని పాటలు కూడా ఫినిష్ చేశారట .

కాగా ఈ సినిమాకి టైటిల్ విషయంలో హను రాఘవపూడి బిగ్ మిస్టేక్ చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు కెరియర్ లోనే పరమ చెత్త సినిమాగా నిలిచిన సైనికుడు సినిమా టైటిల్ను ఈ మూవీకి పెట్టబోతున్నారట . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు ప్రభాస్ ఫ్యాన్స్ హను రాఘవపూడి పై మండిపడుతున్నారు . పోయి పోయి ఆఫ్లాప్ సినిమా టైటిల్ని చూస్ చేసుకున్నారు.. ఏంటి ..?మా ప్రభాస్ అన్న సినిమా హిట్ అవ్వాలి .. ముందు టైటిల్ మార్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు . దీంతో ఈ వార్త బాగా ట్రెండ్ అయిపోతుంది..!!