మోక్షజ్ఞ సినీ ఎంట్రీని అడ్డుకుంటుంది ఆయనేనా..? ఇన్నాళ్లకు బయటపడిన సంచలన నిజం..!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్ . నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు జనాలు. ఇప్పటికే చాలామంది అలా ఎంట్రీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో రాజ్యాన్ని ఏలేస్తున్నారు. అయితే నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన ఎంట్రీస్ కూడా ఇప్పటికే బెర్త్ లను కన్ఫామ్ చేసేసుకున్నారు. మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కొనసాగించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన వారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి .

అదిగో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా వచ్చేస్తుంది. ఇదిగో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఆ డైరెక్టర్ తోనే .. ఆ సినిమాలో హీరోయిన్ ఆమె.. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఫలానా డైరెక్టర్ అంటూ ఇప్పటివరకు బాలయ్య కమిట్ అవ్వలేదు. అంతేకాదు ప్రెసెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్న బాలయ్య త్వరలోనే తన కెరీర్ లోనే హిట్ సినిమా అయిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 అనే సినిమాతో మోక్షజ్ఞను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది .

ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా కన్ఫామ్ అయిపోయింది. బోయపాటి డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. అయితే లాస్ట్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ని ఆపేశారు .. ఓ పెద్దాయన.. ఆయన మరెవరో కాదు. నందమూరి బాలయ్య ఎంతగానో నమ్మే ఓ పూజారి . మోక్షజ్ఞ జాతకం ప్రకారం 2025 సెప్టెంబర్ వరకు సినీ ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయన కెరియర్ అంతా ఆశాజనికంగా ఉండదట. అందుకే 2025 సెప్టెంబర్ పైనే మోక్షజ్ఞను ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేయమంటూ సజెస్ట్ చేశారట . దీంతో అంతా ఫిక్స్ అయ్యాక బాలయ్య కూడా మనసు మార్చుకున్నాడట. ఇన్ని సంవత్సరాల ఆగాము.. ఇంకొక్క సంవత్సరం ఆగలేమా అంటూ మోక్షజ్ఞ ఎంట్రీని పోస్ట్ పోన్ చేశారట. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!