ఎండాకాలం లో చిరాకుగా ఉంది అని ఆ పని ఎక్కువ చేస్తున్నారా.. ? జబ్బును కొని తెచ్చుకున్నట్లే..జాగ్రత్త..!

జనాలను భయపెట్టే ఎండాకాలం వచ్చేసింది.. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు .. ఉదయం 9 గంటలు దాటింది అంటే కాలు బయట పెట్టాలి అంటే చుక్కలు కనిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న వేడికి ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటూ జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కొందరు మాత్రం బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లడం మంచిది అంటున్నారు డాక్టర్లు . అయితే ఎండాకాలంలో చాలామందికి ఉక్కపోతకు చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తలలో ఆ చెమటకి జుట్టుకి చుండ్రు ఫామ్ అయిపోతూ ఉంటుంది . చిరాకు చిరాకుగా ఉంటుంది .

 

మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు వంటగదిలో వంట చేస్తున్నప్పుడు బయట వేడికి వంటింట్లోని సెగకు ఎక్కువగా తలలో చెమట పట్టేస్తూ ఉంటుంది . కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా సరే తలస్నానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మహిళలు . అదేవిధంగా కొందరు అబ్బాయిలు కూడా బయట తిరిగి ఆ చెమటకు ఆ జిడ్డుకు తలస్నానం ఎక్కువగా చేస్తూ ఉంటారు . అయితే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు . ఎక్కువసార్లు తల స్నానం చేయడం వల్ల తలలో నెమ్ము దిగుతుంది అని .. నీరు చేరిపోతే అది రకరకాల జబ్బులకు దారితీస్తుంది అని చెప్పుకొస్తున్నారు .

Young man and heat stroke.

ఒకవేళ మీకు చిరాకుగా.. ఇబ్బందిగా ఉంటే తలస్నానం చేయాల్సివస్తే గోరువెచ్చని నీటితోనే చేయాలి . అదేవిధంగా చెవిలో దూది పెట్టుకుని ..వాటర్ చెవిలో పోకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా తలస్నానం చేసిన వెంటనే డీ ఫ్రీజ్ లోని వాటర్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ చెప్పుకు వస్తున్నారు. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట వల్ల చిరాకు పుడుతుంది ..అయితే వాటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అని ..ప్రతి రోజు తలస్నానం చేసి తల సరిగ్గా ఆరపెట్టుకోకపోతే నెమ్ము దిగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని .. ఫ్యూచర్లో అది మరింత ప్రాబ్లం గా మారిపోతుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు..!!