సమ్మర్ సీజన్లో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఇది మీకోసమే ..డోంట్ మిస్..!

సమ్మర్ సీజన్ వచ్చేసింది .. బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. తెలుగు రాష్ట్రాలలో 40 డిగ్రీల పై గానే ఈ ఎండ ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . కొన్ని కొన్నిచోట్ల 45 డిగ్రీలు కూడా దాటేస్తుంది . అయితే చాలామంది జనాలు ఈ ఎండకు బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉంటూ.. ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు . మరి ముఖ్యంగా సమ్మర్ సీజన్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడిపండ్లు. బయట సూర్యుడు ఎంత భగభగ మండినా కూడా మనం ఎండలో వెళ్లి మరి మామిడి పండ్లను కొని తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం .

సమ్మర్ సీజన్లో మామిడిపండు ఎక్కువగా తింటూ ఉంటాం. చాలామందికి ఆ అలవాటు ఉంటుంది . అయితే మామిడి పండ్లను తినేముందు అరగంట సేపు అయినా సరే నీళ్లలో కడిగి నాన పెట్టుకొని తినడం ఉత్తమంటున్నారు డాక్టర్లు . మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అయితే ఈ సమ్మర్ సీజన్లో ఎవరిని కంట్రోల్లో పెట్టలేం .. పెరిగిపోతున్న ఎండకి వేడి పుట్టించే పధార్ధాలు తింటే ఇంకా బాడీలో హీట్ పెరిగిపోతుంది ..తద్వారా కొన్ని కొన్ని జబ్బులు వచ్చేస్తాయి .

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి అస్సలు మనం డైరెక్ట్ గా మ్యాంగో ను కడగకుండా అదే విధంగా నాన పెట్టకుండా ఇవ్వకూడదట. మామిడి పండ్లు తినే ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను శుభ్రంగా వాష్ చేసుకుని అరగంట సేపు నీళ్లలో నానబెట్టి.. ఆ తర్వాత కట్ చేసుకుని తినడం లేదా జ్యూస్ చేసుకుని తాగడం వంటివి చేయడం ఉత్తమం అంటూ డాక్టర్ లు సజెస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మామిడి పండ్లు అంటే ఎంతో ఇష్టం ఉన్నవాళ్లు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి మీకు నచ్చినన్ని మ్యాంగోస్ లో లాగించేయండి..!