సినీ ఇండస్ట్రీలో ఎవరిని పడితే వాళ్లని నేను అలా పిలవను.. కేవలం వారిద్దరిని మాత్రమే నేను అలా భావిస్తా.. నటి జయసుధ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయసుధకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి దిగ్గజ హీరోల సరసన హీరోయిన్గా నటించి మెప్పించిన జయసుధ సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈ అమ్మడు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తుంది. నిన్న మొన్నటి వరకు వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ కీలకపాత్రలో నటించి మెప్పించిన జయసుధ.. ఇటీవల సినిమాల్లో కాస్త తక్కువగా మెరుస్తూ.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కనిపిస్తుంది.

సోషల్ మీడియాకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉండే జయసుధ.. ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీ గురించి సంచల వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు.. తెలుగు ఇండస్ట్రీలో నేను కొంతమందిని మాత్ర‌మే సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా.. అందరిని ఎలా పడితే అలా నేను పిలవను.. కుటుంబ అంటే కుటుంబమే. మోహన్ బాబు, మురళీమోహన్ నన్ను చెల్లమ్మ అంటారు. వాళ్ళని మాత్రమే నేను అన్నయ్య అని పిలుస్తా.

అంతేకానీ ఎవరిని పడితే వారిని అన్నయ్య, అక్క అని పిలవడం నాకు అలవాటు లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయంలో గత ఏడాది తెలుగులో వారసుడు, నాగచైతన్య కస్టడీ, నరేష్.. పవిత్రలో మళ్ళీ పెళ్లి, అనుష్క మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాల్లో కీలకపాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె మొదటిసారి ఇంగ్లీష్ షార్ట్ ఫిలింలో నటించనుంది. దీనికి సంబంధించిన ప్ర‌తి అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది జయసుధ. ప్రస్తుతం ఆమె ఏ టాలీవుడ్ సినిమాల్లోనూ నటించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తోంది.