రామ్ ఇస్మార్ట్ జాతర షురూ.. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్..?!

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యతను చూపిస్తూ తనకి స్టార్ డైరెక్టర్గా భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమా యూత్ అప్పట్లో భారీగా ఆకట్టుకునేవి. అలాగే ఆయన సినిమాల్లో కంటెంట్ అద్భుతంగా కనెక్ట్ అయ్యేది. అలా గతంలో రామ్‌ పోతినని హీరోగా పెట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాను తెరకెక్కించాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా డబ్బులు స్మార్ట్ రూపొందిస్తున్నాడు పూరీ జగన్నాథ్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ జనాల్లో కూడా ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ కి, పూరి జగన్నాథ్ కి ఇద్దరికీ సరైన సక్సెస్ లేదు. దీంతో మరోసారి డబ్బులు ఇస్మార్ట్‌తో వీరిద్దరూ తమ స్టామినా ప్రూవ్ చేసుకుని.. సక్సెస్ అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఈ సినిమా కోసం చాలా కసిగా శ్రమిస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు.. రిలీజ్ డేట్ పై త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారట మేక‌ర్స్‌. ఈ సినిమాను మొద‌ట మార్చి 8న మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. దీంతో జూన్‌లో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్‌కు తీసుకురావాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్లు సమాచారం. చూడాలి ఈ సినిమా జూన్‌లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. వీరిద్దరు ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌లుగా భారీ పాపులారిటీ దక్కించుకుంటారు అనడంలో సందేహం లేదు.