సలార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తే భారీ బొక్క తప్పదా..? ఎందుకంటే..?

సలార్ ..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే ప్రభాస్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది . శౌర్యంగా పర్వం అంటూ టైటిల్ కూడా అనౌన్స్ చేసేసాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్లో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారట.

అయితే ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ని చాలా మంది డైరెక్టర్స్ వాడుకొని వదిలేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . గతంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే విధంగా చేశారు . చరణ్ పాత్రను హైలైట్ చేసి తారక్ పాత్రను తొక్కేశారు . ఇప్పటికే ఆ విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు రాజమౌళి. అంతే కాదు పలువురు హీరోలు ఎన్టీఆర్ ని వాడుకొని ఆ తర్వాత ఆయన పట్టించుకోకుండా మానేశారు అని మండిపడుతున్నారు నందమూరి అభిమానులు .

ఈ సినిమాలో నటించిన తర్వాత తారక్ క్రేజ్ వల్ల హిట్ అయితే తారక్ వల్ల హిట్ అయింది అని .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాలో నటించడం వల్ల తారక్ క్రేజ్ పెరిగింది అని.. రెబెల్ ఫాన్స్ వార్ చేసుకోవడం పక్క అంటూ సినీ విశ్లేషకులు ముందుగానే హెచ్చరిస్తున్నారు . కొంతమంది ఎన్టీఆర్ సలార్ 2 లో నటించకపోవడం బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి దీనిపై ప్రశాంత్ నీల్ – ప్రభాస్ – ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..??