పవన్ కళ్యాణ్ విషయంలో ఈ ముగ్గురు హీరోలు సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా..? ఇంత పిరికి వాళ్లా..?

పవన్ కళ్యాణ్ ..ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది . త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బడా బడా ప్రముఖులు కూడా కదలి వస్తున్నారు. ఇప్పటికే నాగబాబు.. నాగబాబు భార్య ..నాగబాబు కొడుకు.. అదే విధంగా సాయిధరమ్ తేజ్ ..అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు .

 

రీసెంట్ గా నరేష్ కూడా జనసేన పార్టీకి ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు. మరికొందరు ప్రొడ్యూసర్స్.. డైరెక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూమెంట్లో ముగ్గురు హీరోల పేర్లు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు మరెవరో కాదు ఎన్టీఆర్ – ప్రభాస్ – బన్నీ .

 

ఈ ముగ్గురు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారం చేయకపోవడం ..ఆయనపై పాజిటివ్ గా కూడా కామెంట్ చేయకపోవడం ఫాన్స్ కు తీవ్ర అసంతృప్తినిస్తుంది . మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ కి ఇంకా కొద్దిరోజులే ఉన్నాయి . కనీసం వీళ్ళకి ఓటేయండి అంటూ ప్రచారం చేయకపోయినా పర్లేదు జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం అయినా చేయాలిగా అంటున్నారు . కానీ ఈ ముగ్గురు హీరోలు అసలు రాజకీయాలకు దూరంగా ఉండడం గమనార్హం . వాళ్ళకి రాజకీయాలు అంటే పడకపోవడం కారణంగానే ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు అంటూ ఫ్యాన్స్ చెప్తుంటే .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ముగ్గురు హీరోస్ పై గుర్రుగా ఉన్నారు..!!