ఈ ప్రపంచంలో ఆమె కంటే అందగత్తె మరొకరు ఉండరు.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ క్రేజీ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. సీతారామం సినిమాతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ నటన, అందంతో పాటు తన మాటకారి విధానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు అయినా సరే సినీ బ్యాగ్రౌండ్ ఎంత ఉన్న దానిని ఉపయోగించకుండా ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను తెచ్చుకున్నాడు. నిజానికి దుబాయ్ లో జాబ్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్న దుల్కర్‌కు చిన్నపటి నుంచి యాక్టర్ కావాలనే కల ఉండేదట. అయితే ఆయన తండ్రికి దుల్కర్ సల్మాన్ నటుడు అవ్వడం ఇష్టం లేదు. దుల్కర్ కి సినిమా వాతావరణం మొదటి నుంచి దూరంగానే ఉంచాలని చూస్తూ ఉండేవాడట.

Mammootty, Dulquer Salmaan to share screen space in Bilal? Chup actor has  THIS to say - India Today

కానీ నటన తమ బ్లడ్ లోనే ఉంటుంద‌న‌ట్లు నటుడి కొడుకు చివరికి మళ్ళీ నటుడే అయ్యాడు. పెళ్లి చేసుకుంటే ఆయన మారుతాడని మమ్ముట్టి భావించాడు. 2011లో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందే.. అమల్‌ అనే ఒక నార్త్ ఇండియన్ ముస్లిం కుటుంబా అమ్మాయికిచ్చి వివాహం చేశాడు. ఈ అందగాడికి అంత‌కు మించిన‌ అందగత్తె తోడైంది. విరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమల్‌ స్థానం ఎంతో గొప్పదని.. ఆమె నా జీవితం లోకి వచ్చాకే నా కెరీర్ టర్న్ అయిందని.. నా అదృష్ట దేవత అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.

Dulquer Salmaan, wife Amal and daughter Maryam celebrate Eid at home. See  pic - India Today

ఆమె ఎంకరేజ్మెంట్ తోనే సెకండ్ షో సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశానని.. ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా కొనసాగడానికి తను కార‌ణం ఆమె లేకపోతే నా జీవితంలో ఏది సరిగా ఉండేది కాదంటూ వివరించాడు. తనే నా అదృష్ట దేవత అంటూ చెప్పిన ఈయన.. ఆమెతో నేను పీకల్లోకి ప్రేమలో ఉన్నా.. ఆమెను కాకుండా మరొక అమ్మాయి ఎవరిని నా జీవితంలో ఊహించుకోలేను.. ప్రపంచం మొత్తంలోనే నా దృష్టిలో ఆమె కంటే అందమైన వారు మరొకరు ఉండరు అంటూ భార్యపై ప్రేమను ఓ స్టేజ్‌పై బయటపెట్టాడు. ఇక‌ 2011లో వివాహం చేసుకున్న ఈ జంట‌ 2017లో ఓ కూతురికి జన్మనిచ్చారు.