మెట్ గాల ఈవెంట్లో పూల చీరతో మెరిసిన ఆలియా.. సారీ స్పెషాలిటీస్ ఇవే..?!

బాలీవుడ్ ముద్దుగా ఆలియా భ‌ట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ అమ్మడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆలియా తాజాగా మేట్‌గాల 2024 రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా భ‌ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి, ప్రత్యేకంగా కనిపించడానికి, స్పెషల్ గా డిజైన్ చేయించిన రంగు రంగు పువ్వులతో ఉన్న చీరలు ధరించి స్టిల్స్ ఇచ్చింది. అక్క‌డ‌కు వ‌చ్చిన అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.

Met Gala 2023: Alia Bhatt's 23-foot-long saree was crafted over 1965  man-hours

అయితే ఈమె ఈ కార్యక్రమంలో కట్టుకున్న చీర వెనుక చాలా పెద్ద కథ ఉందట. మేట్ ఈవెంట్ లో ఆలియా కట్టుకున్న షిమారీ చీరని ప్రముఖ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేశాడ‌ట‌. గార్డెన్ ఆఫ్ టైం అనే థీంకు అతికినట్టు.. సరిపోయేలా, మన దేశ సంస్కృతికి తగ్గట్టుగా ఈ శారి డిజైన్ చేశాడు. ఇక ఈ చీరలు తయారు చేసేందుకు ఏకంగా 163 మంది డిసైనర్స్ 1905 గంటల పాటు కష్టపడి పని చేశారని తెలుస్తోంది. ఈ చీరా ఇటలీలో తయారయింది. వారి కష్టానికి తగ్గట్టే ఈమె కట్టిన చీర ఈవెంట్లోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Alia Bhatt arriving at the 2024 Met Gala

ఏది ఏమైనా ముఖ్య కార్యక్రమాలకు అలియాభట్ తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత కొద్ది రోజుల క్రితం తన జాతీయ ఉత్తమ న‌ట్టిగా అవార్డు అందుకోవడానికి వెళ్లిన సమయంలో.. ఏకంగా తన పెళ్లి చీర కట్టుకొని కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మేట్ గాలా ఈవెంట్లో ఇలా చాలా విశేషమైన చీరను క‌ట్టుకొని సాంప్రదాయ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. దీన్ని బట్టి ఆలియా చీరకట్టుకు ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతుంది.