ఆర్య సినిమాతో తరుణ్ కి ఉన్న ఆ స్పెషల్ సంబంధం ఏంటో తెలుసా..? అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందా..?

ఆర్య .. ఈ సినిమా పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల శుభ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ క్రమంలోనే ఆర్య సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారాయి . కాగా అసలు నిజానికి ఆర్య సినిమాను మిగతా వేరే స్టార్ హీరోలతో చిత్రీకరించాల్సింది సుకుమార్ .

దేవుడు చేసిన మాయ కారణంగా బన్నీ చేతికి వచ్చింది. అయితే బన్నీ – గంగోత్రి సినిమా చేసిన తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్నారట . స్టార్ స్టేటస్ ఉన్నా కూడా లుక్స్ పరంగా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో బన్నీకు ఆఫర్లు రాలేదట . ఈ క్రమంలోనే రిలీజ్ అయిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చాడట . ఇదే మూమెంట్లో దిల్ సినిమా కూడా రిలీజ్ అయిందట . దిల్ సినిమా చూసి ఆల్రెడీ బాగా ఎంజాయ్ చేశాడట . అంతేకాదు ఇడియట్ లాంటి సినిమా తనకి ఎప్పుడు పడుతుంది అంటూ వెయిట్ చేశారట .

అయితే దిల్ సినిమా మళ్లీ దిల్ రాజు స్పెషల్ షోస్ వేస్తున్నాడు అని తెలియడంతో తరుణ్ ..బన్నీ కు కాల్ చేసి వెళ్దామా..? అంటూ అడిగారట . ఆల్రెడీ సినిమా చూశాను కానీ మళ్ళీ చూద్దాం సినిమా బాగుందిగా అంటూ వెళ్లారట . అప్పుడే సుకుమార్ బన్నీని చూశాడట . ఆర్య కథ నీకు అయితే బాగుంటుంది అంటూ స్టోరీ వివరించారట. స్టోరీ వినడం బన్నీ ఓకే చేయడం సెట్స్ పైకి త్వరగా వచ్చేయడం.. ఆ తర్వాత రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకోవడం బాగా జరిగిపోయింది . ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ ప్రాణం పెట్టినటించాడు .అందుకే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!