టిల్లు స్క్వేర్ సక్సెస్ తో వరుస ఆఫర్లు కొట్టేసిన అనుపమ.. మొత్తం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?!

మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్‌తో కెరీర్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గ‌తేడాది కార్తికేయ 2 సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ తెలుగుతోపాటు ఇతర భాషలో రిలీజై సక్సెస్ అందుకోవడంతో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక తాజాగా ఈమె నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమాకు మరింత క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీ రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టి.. అమ్మడు మార్కెట్ ని కూడా పెంచేసింది.

Crime comedy 'Tillu Square' gets OTT release date

దీంతో ఈమెకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ ఏకంగా ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక ప్రస్తుతం హనుమన్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అక్టోపస్ వర్కింగ్ టైటిల్ తో వ‌స్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బండి సరోజ్ కుమార్ డైరెక్షన్లో పరదా సినిమాలోని నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Anupama Parameswaran's 'Paradha' title glimpse intriguing - Telugu News - IndiaGlitz.com

ఇకపోతే టాలీవుడ్ లోనే కాక తమిళ్లోనే అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం తమిళ్ లో పెట్ డిటెక్టివ్ అనే సినిమాతో నటిస్తుంది. సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు ఉన్నాయి. అలానే ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న సెల్వరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బైసన్ సినిమాలోని ఈమె నటిస్తుంది. లాక్ డౌన్ అనే సినిమాలోని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

Project O: Hanu-Man director Prasanth Varma wraps up a key schedule | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT